Adilabad: రిమ్స్‌లో కార్మికుల ధర్నా రూ.26 వేల కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్!

Adilabad: ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రి ఓపీ విభాగం ఎదుట ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కాంట్రాక్ట్ కార్మికులు కనీస వేతనాలు, ఈఎస్‌ఐ నిధుల కోసం ధర్నా చేపట్టారు.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad
Published on: 7 July 2026 1:44 PM IST
Adilabad
X

Adilabad: రిమ్స్‌లో కార్మికుల ధర్నా రూ.26 వేల కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్!

Adilabad: ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రి ఓపీ విభాగం ఎదుట కాంట్రాక్ట్ కార్మికులు మంగళవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి సిర్ర దేవేందర్ మాట్లాడుతూ.. పెరుగుతున్న నిత్యావసరాల ధరలకు అనుగుణంగా ప్రభుత్వ ఆసుపత్రి కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు.

అలాగే పెండింగ్‌లో ఉన్న వేతనాలతో పాటు పీఎఫ్, ఈఎస్‌ఐ నిధులను వెంటనే విడుదల చేసి కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆయన కోరారు. అదేవిధంగా కార్మికులకు యూనిఫామ్ లను అందజేయాలన్నారు. కార్మికుల కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్తో ఈనెల 9న డిఎంఈ కార్యాలయం ముట్టడి చేపడుతున్నట్లు పేర్కొన్నారు.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

మూడు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆదిలాబాద్ జిల్లా రాజకీయ, సామాజిక మరియు గిరిజన ప్రాంతాల పరిణామాలపై అపారమైన పట్టున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story