Adilabad: కనీస వేతనం రూ. 26 వేలు ఇవ్వాలని కలెక్టరేట్ ఎదుట ధర్నా!

Adilabad: రిమ్స్ ఆసుపత్రి కార్మికులకు రూ. 26 వేల కనీస వేతనం ఇవ్వాలని సిఐటియు జిల్లా కార్యదర్శి కిరణ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట భారీ ధర్నా నిర్వహించారు.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad
Published on: 13 July 2026 4:28 PM IST
Adilabad
X

Adilabad: కనీస వేతనం రూ. 26 వేలు ఇవ్వాలని కలెక్టరేట్ ఎదుట ధర్నా!

ఆదిలాబాద్: ఆస్పత్రిలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలను పరిష్కరించాలని సిఐటియు జిల్లా కార్యదర్శి కిరణ్ డిమాండ్ చేశారు. కార్మికులకు కనీస వేతనం రూ:26 వేలు చెల్లించాలని కోరుతూ సోమవారం రిమ్స్ నుండి నిరసన ర్యాలీ నిర్వహించారు.

అనంతరం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. పెండింగ్లో ఉన్న వేతనాలతో పాటు ఈఎస్ఐ పిఎఫ్ బకాయిలను వెంటనే చెల్లించాలన్నారు. కార్మికుల సీనియార్టీ ప్రకారం ప్రమోషన్లు కల్పించాలని కోరారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కార్మికుల సమస్యల పరిష్కరించాలని లేనిపక్షంలో రాబోయే రోజుల్లో సమ్మెకు పిలుపునిస్తామని హెచ్చరించారు.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

మూడు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆదిలాబాద్ జిల్లా రాజకీయ, సామాజిక మరియు గిరిజన ప్రాంతాల పరిణామాలపై అపారమైన పట్టున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story