Adilabad: రిమ్స్‌లో చిన్నారుల మరణాలు ప్రభుత్వ హత్యలే: కవిత!

Adilabad: రిమ్స్‌లో పసిపిల్లల మరణాలు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే: ఆదిలాబాద్‌లో భగ్గుమన్న బీఆర్ఎస్ నేత కవిత. రూ. 50 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని, లేకుంటే ఘెరావ్ తప్పదని హెచ్చరిక.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad
Published on: 23 Sept 2026 6:36 PM IST
Adilabad
X

Adilabad: రిమ్స్‌లో చిన్నారుల మరణాలు ప్రభుత్వ హత్యలే: కవిత!

అదిలాబాద్: అదిలాబాద్ రిమ్స్ హాస్పిటల్ సందర్శించిన కవిత మాట్లాడుతూ దత్తత తీసుకున్న జిల్లాలో చిన్నారులు చనిపోతే ముఖ్యమంత్రికి వచ్చే తీరిక లేదా అని ప్రశ్నించారు. ఫుట్ బాల్ ఆడేందుకు, విదేశాల్లో తిరిగేందుకు మాత్రం సమయం ఉన్న సీఎంకు పసిపిల్లల ఆరోగ్యంపై శ్రద్ధ లేదని, అదిలాబాద్ రిమ్స్ ను పరిశీలించేందుకు వచ్చిన హెల్త్ మినిస్టర్ ఎక్స్ కర్షన్ కు వచ్చినట్లు వచ్చి బాధ్యత లేకుండా వ్యవహరించారని ఆరోపించారు కవిత..

బాధిత కుటుంబాలకు రూ.50 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు..నెల రోజుల్లో హాస్పిటల్ పెండింగ్ బిల్లు చెల్లించాలి.. ఆదివాసీ ప్రాంతాలకు రోడ్లు వేయాలి, లేదంటే ఏజెన్సీల్లోని ఆదివాసీలతో కలిసి ఆదిలాబాద్ ను ఘెరావ్ చేస్తామని హెచ్చరించారు కవిత.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

మూడు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆదిలాబాద్ జిల్లా రాజకీయ, సామాజిక మరియు గిరిజన ప్రాంతాల పరిణామాలపై అపారమైన పట్టున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.