Adilabad: ప్రాణాలకు తెగించి పసిబిడ్డలను కాపాడిన నర్స్ ప్రమీల!
Adilabad: ఆదిలాబాద్ రిమ్స్ అగ్నిప్రమాదంలో పసిబిడ్డలను కాపాడి అస్వస్థతకు గురైన నర్స్ ప్రమీల నిమ్స్‌కు తరలింపు: ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్, పరామర్శించిన ఎమ్మెల్యే పాయల్ శంకర్.
Adilabad: ప్రాణాలకు తెగించి పసిబిడ్డలను కాపాడిన నర్స్ ప్రమీల!
ఆదిలాబాద్: ఆదిలాబాద్ రిమ్స్ లో గల పాత SNCU వార్డులో ఇటీవల చోటు చేసుకున్న షార్ట్ సర్క్యూట్ ఘటనలో శిశువులను కాపాడే క్రమంలో తీవ్రంగా అస్వస్థకు గురైన నర్స్ ప్రమీలను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు ఆదివారం తరలించారు.
షార్ట్ సర్క్యూట్ ఘటనలు పొగ కారణంగా ఆమె ఊపిరితిత్తులలో ఇన్ఫెక్షన్ కావడంతో నిమ్స్ కు అంబులెన్స్లు తరలించారు. అంతకుముందు ప్రమీలను ఎమ్మెల్యే పాయల్ శంకర్ పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు.




