Adilabad: రిమ్స్ ఆసుపత్రి అగ్నిప్రమాదంపై పూర్తి నివేదిక సిద్ధం!
Adilabad: ఆదిలాబాద్ రిమ్స్ ఎస్ఎన్సీయూ అగ్నిప్రమాదంపై కమిటీ నివేదిక సిద్ధం. ఐటీడీఏ పీవోకు నివేదిక అందజేత, ప్రభుత్వానికి పంపనున్న కలెక్టర్ రాజర్షి షా.
Adilabad: రిమ్స్ ఆసుపత్రి అగ్నిప్రమాదంపై పూర్తి నివేదిక సిద్ధం!
Adilabad: ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలోని ఎస్ఎన్సీ యూలో జరిగిన అగ్నిప్రమాద ఘటనపై పూర్తి స్థాయి నివేదిక సిద్ధమైంది. కమిటీ సభ్యులైన అదనపు డీఎంహెచ్వై మనోహర్, విద్యుత్అఖ ఎస్ఈ రాథోడ్ సుభాష్, డీఎంఆర్టీ ప్రభాకర్, టీఎస్ఎంఐ డీసీ ఈఈ రాంకుమార్, అగ్నిమాపకశాఖ అధికారి భగవాన్రెడ్డి పైనల్ రిపోర్టును సోమవారం సిద్ధం చేశారు. దాదాపు 45 మంది వైద్యులు, సిబ్బందిని విచారించారు. సీసీ కెమెరాల పుటేజీలను పరిశీలించారు.
ప్రమాదానికి గల కారణాలను సేకరించారు. రిమ్స్ సాయంత్రం వరకు తీవ్ర కసరత్తు చేసిన కమిటీ సభ్యులు చైర్మన్ అయిన ఐటీడీఏ పీవో మం ద మకరందుకు నివేదిక అందజేశారు. ఆయన కలెక్టర్ రాజర్షిషాకు సమర్పించనున్నారు. జిల్లా బాస్ ప్రభుత్వానికి నివేదించనున్నారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వైద్య ఆరోగ్య శాఖ రాష్ట్ర ఉన్నతాధికారులు రిమ్పై సమీక్ష నిర్వ హించనున్నట్లు తెలిసింది. ఈ నివేదిక ఆధారంగా తగు చర్యలు చేపట్టనున్నారు. అలాగే రిమ్స్ అభివృ ద్ధికి నిధులతో పాటు ఆయా పోస్టులు కేటాయించే అవకాశమున్నట్లుగా చెబుతున్నారు. అయితే నివే దికలో ఏముంది ఘటనకు బాధ్యులేవరు ఎవ రిపై ఎలాంటి చర్యలుంటాయనేది ప్రస్తుతం చర్చ నీయాంశంగా మారింది. అలాగే ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ సీఎంను కలిసి రిమ్స్ లోటుపాట్లు, నిధుల కేటాయింపుపై నివేదిక అందించనున్నట్లు తెలిసింది.




