Adilabad: ఆదిలాబాద్ యాపల్ గూడ బెటాలియన్ వద్ద రోడ్డు ప్రమాదం!
Adilabad: ఆదిలాబాద్ రూరల్ మండలం యాపల్ గూడ బెటాలియన్ వద్ద రోడ్డు ప్రమాదం.. ఆర్ఎస్ఐ రాకేష్‌పై హత్యాయత్నం జరిగిందంటూ కుటుంబ సభ్యుల ఆరోపణలు.
Adilabad: ఆదిలాబాద్ యాపల్ గూడ బెటాలియన్ వద్ద రోడ్డు ప్రమాదం!
Adilabad: ఆదిలాబాద్ రూరల్ మండలం యాపల్ గూడ పోలీస్ బెటాలియన్ వద్ద రోడ్డు ప్రమాదం.బెటాలియన్ ఆర్ఎస్ఐ రాకేష్ బైక్ ను ఢీకొన్న బెటాలియన్ ఆర్ ఐ నరేష్ వాహనం. బెటాలియన్లు జరుగుతున్న అవినీతి అక్రమాలు బయట పడుతున్నాయని ఫిర్యాదు చేశాడని అనుమానంతో రాకేష్ పై హత్యాయత్నం జరిగినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
డ్యూటీ ముగించుకొని తిరిగి వస్తుండగా తిరిగి వస్తుండగా పోలీసు వాహనంతో బెటాలియన్ రిజర్వ్ సిఐ నరేష్ కావాలనే గుద్ది యాక్సిడెంట్ చేశారని ఆరోపిస్తున్నారు కుటుంబ సభ్యులు, కొంతమంది బట్టలేని సిబ్బంది.
ఇటీవల యాపల్ గూడ బెటాలియన్ లో జరిగిన అవకతవలపై 12పేజీలు లేఖను ఉన్నతాధికారులకు అందించిన గుర్తుతెలియని వ్యక్తులు,ఎస్సై రాకేష్ ఆ లేఖను విడుదల చేశారని కుట్రతో హత్యాయత్నానికి పూనుకున్నారని, ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరిపించి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు కుటుంబ సభ్యులు.




