Gudihathnoor: గుడిహత్నూర్ వద్ద ఆర్టీసీ బస్సులో పొగలు.. తృటిలో తప్పిన ముప్పు!

Gudihathnoor: గుడిహత్నూర్ మండలం దొంగ్రగావ్ వద్ద ఆర్టీసీ బస్సులో పొగలు రావడంతో కలకలం రేగింది. డ్రైవర్ సమయస్ఫూర్తితో 30 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.

NAGULA SATISH, BOATH
Published on: 25 Jun 2026 4:20 PM IST
Gudihathnoor
X

Gudihathnoor: గుడిహత్నూర్ వద్ద ఆర్టీసీ బస్సులో పొగలు.. తృటిలో తప్పిన ముప్పు!

గుడిహత్నూర్: ​ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం దొంగ్రగావ్ వద్ద జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సులో ఒక్కసారిగా పొగలు రావడంతో తీవ్ర కలకలం రేగింది.

ఆదిలాబాద్ నుండి నిర్మల్ వెళ్తున్న ఈ బస్సులో ప్రమాద సమయంలో 30 మంది ప్రయాణికులు ఉండగా, డ్రైవర్ సమయస్ఫూర్తితో బస్సును ఆపి అందరినీ కిందికి దించేయడంతో పెద్ద ప్రమాదం తృటిలో తప్పింది.

అయితే, గతంలో పలుమార్లు రిపేరైన, కండిషన్ లేని ఇలాంటి బస్సులను నడుపుతూ ప్రయాణికుల ప్రాణాలతో ఆర్టీసీ అధికారులు చెలగాటమాడుతున్నారని ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

NAGULA SATISH, BOATH

NAGULA SATISH, BOATH

Next Story