Gudihatnur: గుడిహత్నూర్ వద్ద అదుపు తప్పి బురదలో కూరుకుపోయిన బస్సు

Gudihatnur: ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం డోంగర్‌గావ్ వద్ద బారికేడ్లు లెక్కచేయకుండా వెళ్లిన ఆర్టీసీ బస్సు బురదలో బోల్తా. తృటిలో తప్పిన ప్రాణప్రాయం.

NAGULA SATISH, BOATH
Published on: 21 July 2026 6:38 PM IST
Gudihatnur
X

Gudihatnur: గుడిహత్నూర్ వద్ద అదుపు తప్పి బురదలో కూరుకుపోయిన బస్సు

గుడిహత్నూర్: ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం డోంగర్గావ్ వద్ద జాతీయ రహదారిపై బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఓ ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. ఉట్నూర్ నుండి ఆదిలాబాద్ వైపు వెళ్తున్న ఈ బస్సు, నిబంధనల ప్రకారం సర్వీస్ రోడ్డు గుండా ముందుకు వెళ్లి సోమా కంపెనీ ఎదురుగా ఉన్న యూటర్న్ ద్వారా రావాల్సి ఉంది.

అయితే, రోడ్డు మూసి ఉందని స్పష్టంగా బారికేడ్లు ఏర్పాటు చేసినప్పటికీ, డ్రైవర్ నిబంధనలకు విరుద్ధంగా అక్కడి నుంచే రోడ్డు దాటేందుకు ప్రయత్నించాడు.

ఈ క్రమంలో బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న బురదలో కూరుకుపోయింది. ప్రమాదం జరిగిన వెంటనే బస్సులో ఉన్న ప్రయాణికులు సురక్షితంగా బయటపడి, సమీపంలోని బస్ స్టేషన్‌కు చేరుకుని తమ గమ్యస్థానాలకు వెళ్ళిపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కాగా డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని ప్రయాణికులు అంటున్నారు.

NAGULA SATISH, BOATH

NAGULA SATISH, BOATH

Next Story