Adilabad: విద్యాసంస్థల బంద్ ప్రశాంతం.. విపక్ష విద్యార్థి సంఘాల నిరసన

Adilabad: ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై లాఠీచార్జీకి నిరసనగా ఆదిలాబాద్‌లో వామపక్ష సంఘాలు బంద్ చేపట్టాయి. మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరాయి.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad
Published on: 24 July 2026 11:08 AM IST
Adilabad
X

Adilabad: విద్యాసంస్థల బంద్ ప్రశాంతం.. విపక్ష విద్యార్థి సంఘాల నిరసన

ఆదిలాబాద్: ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై లాఠీ చారి చేయడాన్ని ఖండిస్తూ వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లాలో విద్యాసంస్థల బంద్ నిర్వహించారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాల, కళాశాలలను బంద్ చేయడానికి వెళ్లిన నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. ఇదిలా ఉంటే ప్రైవేట్ విద్యా సంస్థలు ముందుగానే సెలవు ప్రకటించాయి.

ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారంలో కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయాలని నిరసన తెలుపుతున్న విద్యార్థులపై లాటి చార్జ్ చెయ్యడాన్ని ఖండిస్తున్నామన్నారు.

అమ్మాయిలని కూడా చూడకుండా వారిపై సైతం అనుచితంగా వ్యవహరించారని మండిపడ్డారు.

ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థను పక్కడ్బందీ చర్యలు తీసుకోవాలని, కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను బర్తరాఫ్ చేయాలని డిమాండ్ చేశారు.

ఈ నిరసన కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ, యుఎస్ఎఫ్ఐ, ఎన్.ఎస్.యు.ఐ, ఏఐఎస్ఎఫ్, బిఆర్ఎస్వి, యువజన సంఘాల నాయకులు ఉన్నారు

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

మూడు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆదిలాబాద్ జిల్లా రాజకీయ, సామాజిక మరియు గిరిజన ప్రాంతాల పరిణామాలపై అపారమైన పట్టున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story