Adilabad: పోలీసులపై దాడి కేసు: 20 మంది అరెస్ట్.. ఎస్పీ అఖిల్!
Adilabad: సిరికొండ మండలం వాయిపేటలో గంజాయి కేసు దర్యాప్తుకు వెళ్లిన పోలీసులపై దాడి చేసిన కేసులో సర్పంచ్ సహా 20 మందిని అరెస్ట్ చేసినట్లు ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు.
Adilabad: పోలీసులపై దాడి కేసు: 20 మంది అరెస్ట్.. ఎస్పీ అఖిల్!
ఆదిలాబాద్: ఈనెల 10న సిరికొండ మండలం వాయిపేట గ్రామంలో గంజాయి కేసు విషయంలో దర్యాప్తుకు వెళ్లిన పోలీసులపై దాడి ఘటనలో ఇప్పటివరకు 20 మందిని అరెస్టు చేసినట్లు ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. వీరిలో గ్రామ పటేల్, సర్పంచ్, మాజీ ఎంపీటీసీ ఉన్నారన్నారు.
దాడి చేసిన మిగతా వారిని కూడా త్వరలోనే పట్టుకుని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. సుమారు వంద మంది గుంపుగా వచ్చి పోలీసులపై దాడికి పాల్పడ్డారని వెల్లడించారు.




