Adilabad: తలమడుగు మొహరం వేడుకల్లో ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రత్యేక పూజలు!

Adilabad: అదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం రియాడి గ్రామంలో జరిగిన మొహరం వేడుకల్లో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పాల్గొని, హస్సేన్ హుస్సేన్ దేవస్థానంలో పూజలు చేశారు.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad
Published on: 26 Jun 2026 8:43 PM IST
Adilabad
X

Adilabad: తలమడుగు మొహరం వేడుకల్లో ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రత్యేక పూజలు!

అదిలాబాద్: అదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం రియాడి గ్రామంలో మొహరం పండుగ వేడుకల్లో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు..

మత సామరస్యానికి ప్రతీక గా నిలిచే మొహరం పండుగ కులమతాలకు అందరూ కలిసికట్టుగా నిర్వహించుకోవడం అభినందనీయమని అన్నారు జిల్లా ఎస్పీ..

మొహరం పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఎస్పి..

ఈ సందర్భంగా గ్రామానికి వచ్చిన ఎస్పీ అఖిల్ మహాజన్, డీఎస్పీ జీవన్ రెడ్డి లకు ఘనంగా స్వాగతం పలకగా, ఈ సందర్భంగా హస్సేన్ హుస్సేన్ దేవస్థానంలో జిల్లా ఎస్పీ పోలీస్ సిబ్బంది ప్రత్యేక పూజలు నిర్వహించారు..

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

మూడు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆదిలాబాద్ జిల్లా రాజకీయ, సామాజిక మరియు గిరిజన ప్రాంతాల పరిణామాలపై అపారమైన పట్టున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story