Adilabad: ఆదిలాబాద్‌లో పోలీసుల ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం!
Adilabad: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ వేడుకల్లో భాగంగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ స్వయంగా రక్తదానం చేసి శిబిరాన్ని ప్రారంభించారు.
Adilabad: ఆదిలాబాద్‌లో పోలీసుల ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం!
Adilabad: పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్ క్వార్టర్ లో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరానికి విశేష స్పందన లభించింది. పోలీసు అధికారులతో పాటు, వివిధ గ్రామాల ప్రజలు ఈ శిబిరంలో పాల్గొని రక్త దానం చేశారు. ముందుగా ఈ శిబిరాన్ని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ స్వయంగా రక్తదానం చేసి ప్రారంభించారు. అనంతరం రక్తదానం చేసిన వారికి సర్టిఫికెట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ .. 18 సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరు రక్తదానం చేయాలని.. రక్తదానంపై ఎలాంటి అపోహలను నమ్మవద్దని సూచించారు. రిమ్స్ రక్త నిధి కేంద్రంలో రక్త నిలువలు తక్కువగా ఉన్నాయని సమాచారం రావడంతో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మెగా రక్తదానం ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. రక్తదానంతో మరొకరి ప్రాణాలు కాపాడవచ్చు అని అన్నారు.




