Boath: బోథ్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్
Boath: బోథ్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్.
Boath: బోథ్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్
బోథ్: ఆదిలాబాద్ జిల్లా బోథ్ పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ మంగళవారం ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా స్టేషన్‌లోని వాహనాల స్థితిగతులను, రికార్డులను తనిఖీ చేసిన ఆయన, రికార్డుల నవీకరణ ఎప్పటికప్పుడు జరగాలని ఆదేశించారు. సిబ్బంది విధులలో నీతి నిజాయితీ, క్రమశిక్షణ, సమయపాలన పాటించాలని సూచించారు. విపిఓ (VPO) విధానం ద్వారా గ్రామస్థాయిలో ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ, అసాంఘిక కార్యకలాపాలపై పూర్తి నిఘా పెట్టాలన్నారు. ముఖ్యంగా గంజాయి, గుడుంబా, రాయితీ బియ్యం, పశువుల అక్రమ రవాణాను పూర్తిగా రూపుమాపాలని, ఓపెన్ డ్రింకింగ్ జరగకుండా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. అలాగే రోడ్డు భద్రతపై దృష్టి సారించి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించాలని, పెండింగ్ కేసులను త్వరగా పూర్తి చేసి చార్జిషీట్లు దాఖలు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి, బోథ్ సీఐ డి. గురుస్వామి, ఎస్ఐ వి. పురుషోత్తం మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.




