Adilabad: వడ్డీ మాఫియాపై పోలీస్ గర్జన.. భారీగా పత్రాలు సీజ్
Adilabad: ఆదిలాబాద్ జిల్లాలో అక్రమ వడ్డీ వ్యాపారులపై ఎస్పీ అఖిల్ మహాజన్ మెరుపు దాడులు. 45 పోలీస్ బృందాల తనిఖీల్లో బాండ్లు, చెక్కులు, భూమి పత్రాలు స్వాధీనం.
Adilabad: వడ్డీ మాఫియాపై పోలీస్ గర్జన.. భారీగా పత్రాలు సీజ్
Adilabad: ఆదిలాబాద్ జిల్లాలో అమాయక రైతుల నడ్డి విరుస్తూ వారి రక్తాన్ని పిండి పీడుస్తున్న వడ్డీ వ్యాపారులపై జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపిఎస్ కొరడా జలుపించారు. జిల్లాలో ఏకకాలంలో 16 మండలాలలో 45 బృందాలచే దాదాపు వందమంది వడ్డీ వ్యాపారులపై ఆకస్మిక దాడులు నిర్వహించి జిల్లా వ్యాప్తంగా 7 మండలాలలో దాదాపు 15 కేసులు నమోదు చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు.
వ్యవసాయ భూములు తాకట్టు పెట్టుకుని, వ్యవసాయ భూములు తమ పేర్లపై రాయించుకొని వడ్డీ నిర్వహిస్తున్న వడ్డీ వ్యాపారుల పై దాడులు నిర్వహించారు. దాడులలో వడ్డీ వ్యాపారాల వద్ద నుండి ప్రామిసరీ నోట్లో బాండ్లు చెక్కుబుక్కులు ఖాళీ పేపర్స్ స్టాంప్ పేపర్స్ సేల్ డేట్స్ లాంటివి స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు జిల్లా ఎస్పీ.. ప్రజలను మోసం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటూ అక్రమార్కుల ఆటలు కట్టడం చేయడం జరుగుతుంది అని, అసాంఘిక కార్యకలాపాలను పూర్తిగా రూపుమాపే దిశగా జిల్లా పోలీస్ యంత్రాంగం కృషి చేస్తుందని తెలిపారు.




