Adilabad: ఆదిలాబాద్‌లో ఎస్పీ అర్ధరాత్రి తనిఖీలు.. రౌడీషీటర్లకు గట్టి హెచ్చరిక!
Adilabad: ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. రౌడీషీటర్ల ఇళ్లను పరిశీలించి చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడితే జైలు తప్పదని హెచ్చరించారు.
Adilabad: ఆదిలాబాద్‌లో ఎస్పీ అర్ధరాత్రి తనిఖీలు.. రౌడీషీటర్లకు గట్టి హెచ్చరిక!
Adilabad: ప్రజలకు ప్రశాంత వాతావరణం శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా తీసుకుంటున్నారు ఆదిలాబాద్ జిల్లా పోలీసులు నిన్నటి రోజు అర్ధరాత్రి ఆకస్మికంగా రౌడీ షీటర్ల తనిఖీ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ చేపట్టారు.
గురువారం అర్ధరాత్రి 11 గంటల నుండి 12 గంటల సమయంలో ఆదిలాబాద్ పట్టణంలోని ప్రధాన కూడళ్లను మరియు పూరవీధులను సందర్శిస్తూ, ప్రజలకు సమస్యలు తెచ్చే రౌడీషీటర్ల ఇళ్లను తనిఖీ చేయడం జరిగింది. ఇంట్లోనే ఉన్న రౌడీలను పరిశీలించి వారి నేరచరిత్ర ప్రస్తుత, జీవనశైలి, ఉపాధి పరిస్థితులు, సామాజిక వ్యవహార ధోరణులపై ఆరా తీశారు.
చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సన్మార్గంలో ప్రయాణించాలని, తిరిగి నేరాలు చేయాలనే ఆలోచన వస్తే జైలు తప్పదని హెచ్చరించారు. పట్టణంలోని కొలిపుర, రవీంద్ర నగర్, చిలుకూరి లక్ష్మీ నగర్ నందు గల రౌడీషీటర్ ఇళ్లను పరిశీలించి వారిని తనిఖీ చేయడం జరిగింది.
అదేవిధంగా పట్టణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆపరేషన్ పోస్టులను పరిశీలించడం జరిగింది, సిబ్బంది పనితీరు పరిస్థితి పరిశీలిస్తూ, అదేవిధంగా, పట్టణంలో సంచరిస్తున్న వారిని తనిఖీ చేసి మద్యం సేవించి వాహనాలను నడుపుతున్న వారి వాహనాలను జప్తు చేయడం జరిగింది.
అర్థరాత్రి రోడ్లపై తిరిగే వారిని కట్టడి చేయాలన్నారు. రాత్రి సమయాలలో పోలీసు సిబ్బంది పటిష్టంగా గస్తీ నిర్వహిస్తూ ఆర్థిక నేరాలు జరగకుండా చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ డిఎస్పి ఎల్ జీవన్ రెడ్డి, పట్టణ సీఐలు బి సునీల్ కుమార్, కె నాగరాజు సిబ్బంది, ఎస్సైలు నాగనాథ్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




