Adilabad: పోలీసు ఏఆర్ హెడ్ క్వార్టర్స్‌లో ఘనంగా ఆయుధ, వాహన పూజలు!

Adilabad: ఆదిలాబాద్ పోలీసు ఏఆర్ హెడ్ క్వార్టర్స్‌లో విజయదశమి సందర్భంగా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆధ్వర్యంలో ఆయుధ పూజ, వాహన పూజ ఘనంగా నిర్వహించారు.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad
Published on: 20 Oct 2026 11:30 AM IST
Adilabad
X

Adilabad: పోలీసు ఏఆర్ హెడ్ క్వార్టర్స్‌లో ఘనంగా ఆయుధ, వాహన పూజలు!

Adilabad: ఆదిలాబాద్ పోలీసు ఏఆర్ హెడ్ క్వార్టర్స్ లో విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆయుధ పూజ మరియు వాహన పూజా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో ఎస్పీ అఖిల్ మహాజన్ పాల్గొని పండితుల వేద మంత్రోచ్ఛారణల నడుమ ఆయుధాలకు, వాహనాలకు మరియు జమ్మి చెట్టుకు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ప్రజలందరికీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల జీవితాల్లో, కుటుంబాల్లో సుఖసంతోషాలు వెల్లివిరియాలని, ప్రతి ఒక్కరూ అన్ని రంగాల్లో విజయం సాధించాలని ఆకాంక్షించారు.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

మూడు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆదిలాబాద్ జిల్లా రాజకీయ, సామాజిక మరియు గిరిజన ప్రాంతాల పరిణామాలపై అపారమైన పట్టున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.