Adilabad: క్రికెట్ మ్యాచ్‌లో అదరగొట్టిన ఎస్పీ అఖిల్ మహాజన్

Adilabad: అదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పోలీసు సిబ్బందితో కలిసి వీఎన్‌ఆర్ క్రికెట్ అకాడమీ గ్రౌండ్‌లో జరిగిన ఫ్రెండ్లీ టీ20 మ్యాచ్‌లో బంతితో 3 వికెట్లు తీసి అదరగొట్టారు.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad
Published on: 15 Nov 2026 9:20 PM IST
Adilabad
X

Adilabad: క్రికెట్ మ్యాచ్‌లో అదరగొట్టిన ఎస్పీ అఖిల్ మహాజన్

అదిలాబాద్: క్రికెట్ ఫీవర్ యువతనే కాదు ఇటు ప్రభుత్వ ఉద్యోగులు, ఉన్నతాధికారుల సైతం క్రికెట్ ప్రేమికులుగా ఆటగాళ్లుగా మారిపోతున్నారు.. నిత్యం కేసులు, శాంతి భద్రతల పరిరక్షణలో ఖాకి చొక్కా ధరించి బిజీగా ఉండే అదిలాబాద్ జిల్లా ఎస్పీ తో పాటు పలువురు సిఐలు, ఆ ఎస్ఐలు, ఇతర సిబ్బంది కాళ్లకు ప్యాడ్స్, చేతులకు బ్లౌజులు, తలకు హెల్మెట్ ధరించి క్రికెట్ బ్యాట్ పట్టుకొని అదరగొట్టారు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తోపాటు పోలీసు సిబ్బంది.

అదిలాబాద్ పట్టణంలోని విఎన్ఆర్ క్రికెట్ అకాడమీ గ్రౌండ్లో అకాడమీ క్రికెట్ టీం తో సరదాగా 20 20 ఓవర్ క్రికెట్ మ్యాచ్ జరిగింది... ఈ మ్యాచ్లో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ బ్యాటుతో 7 రన్స్ స్కోర్ చేయగా బాలింగ్ లో ఎస్పీ అఖిల్ నాలుగు ఓవర్లు లో బాల్ చేసి 28 ఇచ్చినప్పటికీ మూడు అమూల్యమైన వికెట్లు తీశారు.

మొదట బ్యాటింగ్ చేస్తున్న విఎన్ఆర్ అకాడమీ లెవెన్ టీం నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 142 రన్స్ స్కోర్ చేయగా, అనంతరం బ్యాటింగ్కు దిగిన ఎస్పీ 11 జట్టు 19.2 ఓవర్లలో 122 పరుగులకే పరిమితమైంది.. మొత్తంగా నిత్యం డ్యూటీ పరంగా బిజీగా ఉండే అధికారులు ఆటవిడుపుగా క్రికెట్ పోటీలో పాల్గొన్నారు...

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

మూడు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆదిలాబాద్ జిల్లా రాజకీయ, సామాజిక మరియు గిరిజన ప్రాంతాల పరిణామాలపై అపారమైన పట్టున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.