Adilabad: నాగోబా ఆలయంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రత్యేక పూజలు!
Adilabad: నాగుల పంచమి వేళ ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ కేసలాపూర్ నాగోబా ఆలయాన్ని దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. పటిష్ట బందోబస్తు పరిశీలన.
Adilabad: నాగోబా ఆలయంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రత్యేక పూజలు!
Adilabad: నాగుల పంచమి సందర్భంగా ఆదిలాబాద్ జిల్లాలోని సుప్రసిద్ధ ఆదివాసి దైవ క్షేత్రం నాగోబా ఆలయాన్ని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సందర్శించారు. పర్వదినం పురస్కరించుకొని భక్తుల రాక ఎక్కువగా ఉన్న సందర్భంలో జిల్లా పోలీసులు ద్వారా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి పర్యవేక్షించడం జరిగిందని తెలిపారు.
మొదటగా ఆలయ ధర్మకర్తలు కమిటీ సభ్యులు ఆదివాసి పద్ధతిలో జిల్లా ఎస్పీకి ఆహ్వానం పలికారు. తదుపరి జిల్లా ఎస్పీ మరియు ఉట్నూరు ఎఎస్పీ నాగోబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజ ఈ కార్యక్రమాల అనంతరం ఆలయ కమిటీ సభ్యులు జిల్లా ఎస్పీకి మరియు ఉట్నూరు ఏఎస్పీకి శాలువాతో సత్కరించడం జరిగింది.
తదుపరి బందోబస్తు నిర్వహిస్తున్న అధికారులతో జిల్లా ఎస్పీ జాతర నందు తిరిగి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చేసుకోకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
బందోబస్తు సిబ్బంది, భక్తులు పూర్తిగా వెళ్లిపోయేంతవరకు ఉంటుందని ఎలాంటి సహాయంకైనా డయిల్ 100/112 కు సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉట్నూరు ఎఎస్పీ రుత్విక్ సాయి కొట్టే ఐపీఎస్, ఉట్నూర్ సీఐ ఎం ప్రసాద్, ఇంద్రవెల్లి ఎస్ఐ సాయన్న, ఎస్ఐ విక్రమ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




