Adilabad: కార్తీక పౌర్ణమి వేళ మఠాధిపతి యోగానంద సరస్వతి కాకడా హారతులు!
Adilabad: ఆదిలాబాద్‌లోని శ్రీ రామచంద్ర గోపాల కృష్ణ మఠంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా 21,000 దీపాలు వెలిగించారు. మఠాధిపతి యోగానంద సరస్వతి నేతృత్వంలో కాకడా హారతులు ఇచ్చారు.
Adilabad: కార్తీక పౌర్ణమి వేళ మఠాధిపతి యోగానంద సరస్వతి కాకడా హారతులు!
ఆదిలాబాద్: ఆదిలాబాద్ లోని శ్రీ రామచంద్ర గోపాల కృష్ణ మఠంలో మంగళవారం కార్తిక పౌర్ణమి వేడుకల సందర్భంగా దీపాల అలంకరణ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మఠం ప్రాంగణంలో చేపట్టిన దీపారాధన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీపాల వెలుతురులో ఆలయ ప్రాంగణం ప్రత్యేక శోభను సంతరించుకుంది. అనంతరం మఠాధిపతి శ్రీ యోగానంద సరస్వతి నేతృత్వంలో ఆలయంలో కాకడా హారతులు అందించారు. భక్తి గీతాలను ఆలపిస్తూ... స్వామి వారికి పూజలు జరిపారు.
మఠాధిపతి యోగానంద సరస్వతి మాట్లాడుతూ.. మఠంలో సుమారు 400 సంవత్సరాలుగా కార్తీక పురాణ నియమాలకు అనుగుణంగా కాకడా హారతి పూజలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా మఠంలో దాదాపు 21,000 దీపాలు వెలిగించినట్లు వెల్లడించారు. కార్తీక మాస ముగింపు సందర్భంగా ఈ నెల 29న ఆదివారం ‘కాల’ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ప్రకటించారు. భక్తులకు స్వామివారి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు.




