Adilabad: పాత పెన్షన్ పునరుద్ధరించాలి ఆదిలాబాద్‌లో TGEJAC నిరసన!
Adilabad: సెప్టెంబరు 1న పెన్షన్ విద్రోహ దినంగా పాటిస్తూ ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట టీజీఈ జేఏసీ నిరసన. పాత పెన్షన్ అమలు, పీఆర్‌సీ, డీఏల విడుదలపై డిమాండ్.
Adilabad: పాత పెన్షన్ పునరుద్ధరించాలి ఆదిలాబాద్‌లో TGEJAC నిరసన!
Adilabad: ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చిన హామీ ప్రకారం నూతన పెన్షన్ విధానాన్ని రద్దుచేసి.. పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని టీజీఈ జెఎసి జిల్లా కన్వీనర్ శివకుమార్ డిమాండ్ చేశారు. సెప్టెంబరు ఒకటిని పెన్షన్ విద్రోహ దినంగా పాటిస్తున్నామని పేర్కొన్నారు.
ఇందులో భాగంగా జేఏసీ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట నల్ల రిబ్బన్లతో నిరసన తెలియజేశారు. పిఆర్సి ని ప్రకటించాలని, పెండింగ్ లో ఉన్న డీఏలను అమలు చేయాలన్నారు. ఐదు సంవత్సరాలు పదవి కాలంలో ఉంటున్న ఎమ్మెల్యేలు పెన్షన్ తీసుకుంటున్నప్పుడు 30 సంవత్సరాలు జీవితాన్ని ధారపోస్తున్న ఉద్యోగులకు పెన్షన్ ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు.
Next Story




