Neredigonda: ఆదిలాబాద్ జిల్లాలో పెద్దపులి కలకలం.. అర్ధరాత్రి రోడ్డుపై ప్రత్యక్షం!

Neredigonda: ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని వడూర్-బుద్ధికొండ ప్రధాన రహదారిపై ఆదివారం అర్ధరాత్రి పెద్దపులి సంచరించడం తీవ్ర కలకలం రేపింది.

NAGULA SATISH, BOATH
Published on: 25 May 2026 7:19 AM IST
Neredigonda
X

Neredigonda: ఆదిలాబాద్ జిల్లాలో పెద్దపులి కలకలం.. అర్ధరాత్రి రోడ్డుపై ప్రత్యక్షం!

నేరడిగొండ: ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలో పెద్దపులి సంచరించడం తీవ్ర కలకలం రేపింది. మండల పరిధిలోని వడూర్ – బుద్ధికొండ మార్గంలో గల ప్రధాన రహదారిపై ఆదివారం అర్ధరాత్రి దాటాక, సుమారు ఒంటి గంట సమయంలో పెద్దపులి రోడ్డుపై తిరుగుతూ కనిపించింది. పులి స్వేచ్ఛగా తిరుగుతుండటం చూసి ఆ సమయంలో ప్రయాణిస్తున్న స్థానిక ప్రజలు, వాహనదారులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ​రహదారి పక్కన పులి సంచరిస్తుండటాన్ని గమనించిన కొందరు రైతులు, వాహనదారులు వెంటనే అప్రమత్తమై గ్రామస్థులతో పాటు అటవీ శాఖ అధికారులకు, పోలీసులకు సమాచారం అందించారు.

ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు వివరాలు సేకరించారు. ఈ క్రమంలో తాము పులిని చూసినట్లు రుజువుగా స్థానికులు తమ మొబైల్ ఫోన్లలో తీసిన ఫోటోలను అధికారులకు అందజేశారు. మరోవైపు అటవీ శాఖ సిబ్బంది ఆ ప్రాంతంలో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టి, పులి అడుగుజాడలను (పాదముద్రలను) అధికారికంగా గుర్తించి నిర్ధారించారు.

​పులి సంచార నేపథ్యంలో అటవీ ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న గ్రామాల ప్రజలు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని ఎఫ్‌ఆర్వో గణేష్ సూచించారు.

ముఖ్యంగా వ్యవసాయ పనుల నిమిత్తం పొలాలకు వెళ్లేవారు, పశువుల కాపరులు ఒంటరిగా వెళ్లకుండా గుంపులుగా వెళ్లాలని కోరారు. అలాగే పులికి ఎలాంటి హాని చేయరాదని, వేట కోసం ఉచ్చులు వేయడం, కరెంట్ తీగలు అమర్చడం, వలలు పెట్టడం వంటి పనులు చేస్తే చట్టరీత్యా కఠినమైన చర్యలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు.

NAGULA SATISH, BOATH

NAGULA SATISH, BOATH

Next Story