Adilabad: ఆదిలాబాద్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం!

Adilabad: బ్రాహ్మణ్ సమాజ్ రామాలయంలో అభివృద్ధి పనులకు భూమిపూజ చేసిన ఎమ్మెల్యే పాయల్ శంకర్, మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష. నాణ్యమైన పనుల కోసం ఆదేశాలు.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad
Published on: 17 July 2026 11:38 AM IST
Adilabad
X

Adilabad: ఆదిలాబాద్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం!

Adilabad: ఆదిలాబాద్ పట్టణాన్ని అన్ని రంగాల అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. గురువారం స్థానిక బ్రాహ్మణ్ సమాజ్ రామాలయంలో అభివృద్ధి పనులకు మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూష తో కలిసి భూమి పూజ చేసి ప్రారంభించారు. పట్టణంలోని నిలిచిపోయిన పాత జాతీయ రహదారి పనులు త్వరగా పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.

అదేవిధంగా భూ నిర్వాసితులకు మరోచోట స్థలం కేటాయిస్తామని హామీ ఇచ్చారు. బ్రహ్మం సమాజ్ ఆలయానికి గొప్ప విశిష్టత ఉందని పేర్కొన్నారు. అదేవిధంగా అభివృద్ధి పనులను త్వరగా ప్రారంభించి నాణ్యత పాటిస్తూ పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు రేవతి హనుమాన్లు, గంట జీవన్, శ్రీకాంత్, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్, బ్రహ్మం సమాజ్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

మూడు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆదిలాబాద్ జిల్లా రాజకీయ, సామాజిక మరియు గిరిజన ప్రాంతాల పరిణామాలపై అపారమైన పట్టున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story