Adilabad: ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలపై ప్రభుత్వం మొద్దునిద్ర వీడాలి!

Adilabad: ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (TPUS) ధర్నా. పెండింగ్ బిల్లులు, డీఏలు చెల్లించాలని జిల్లా అధ్యక్షుడు సునీల్ చౌవాన్ డిమాండ్.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad
Published on: 14 July 2026 1:21 PM IST
Adilabad
X

Adilabad: ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలపై ప్రభుత్వం మొద్దునిద్ర వీడాలి!

Adilabad: ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం మొద్దునిద్ర వీడాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు సునీల్ చౌవాన్ అన్నారు. విద్యారంగ, ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు సంబంధించి ఈ కుబేర్ లో పేరుకుపోయిన పెండింగ్ బిల్లులను పూర్తిగా చెల్లించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా 6 డిఏల ప్రకటన విషయంలో ఇప్పటివరకు కదలిక లేదన్నారు. ప్రభుత్వం సిపిఎస్ రద్దు అంశం పరిష్కారం కోసం ప్రత్యేకంగా చొరవ చూపాలన్నారు. పిఆర్సి రిపోర్ట్ వెంటనే తెప్పించుకొని.. 51% ఫిట్మెంట్ ప్రకటన చేయాలన్నారు.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

మూడు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆదిలాబాద్ జిల్లా రాజకీయ, సామాజిక మరియు గిరిజన ప్రాంతాల పరిణామాలపై అపారమైన పట్టున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story