Adilabad: నకిలీ హిజ్రాల ఆగడాలపై చర్యలు తీసుకోవాలి అలీజా!

Adilabad: ఆదిలాబాద్‌లో నకిలీ హిజ్రాల ఆగడాలపై చర్యలు తీసుకోవాలని ట్రాన్స్ జెండర్ల సంఘం డిమాండ్. తమకు ప్రభుత్వం ఉపాధి అవకాశాలు కల్పించాలని అలీజా విజ్ఞప్తి.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad
Published on: 12 Sept 2026 5:48 PM IST
Adilabad
X

Adilabad: నకిలీ హిజ్రాల ఆగడాలపై చర్యలు తీసుకోవాలి అలీజా!

Adilabad: ఇటివల ట్రాన్స్ జెండర్లు హిజ్రాలు డబ్బులు డిమాండ్ చేయడం, అసభ్యంగా ప్రవర్తించడం. దాడులకు తెగపడుతున్నా వైనం పై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. అయితే ట్రాన్స్ జెండర్ల ముసుగులో రచ్చ చేస్తున్న నకిలీ హిజ్రాల పై చర్యలు తీసుకోవాలని ఆదిలాబాద్ జిల్లా ట్రాన్స్ జెండర్ల సంఘం అధ్యక్షులు అలీజా డిమాండ్ చేశారు.

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంఘం సభ్యులతో కలిసి మీడియాతో మాట్లాడారు. నకిలీ హిజ్రాల ఆగడాలకు కళ్లెం వేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కొందరు తమ పేర్లు చెప్పుకొంటూ వికృతచేష్టలతో ప్రజలను వేధింపులకు గురిచేస్తున్నారని, అలాంటి వారి పై చర్యలు తీసుకోవాలని కోరారు.

ట్రాన్స్ జెండర్ల వల్ల అందరు ఇబ్బందులకు గురైయ్యే పరిస్థితి నెలకొందన్నారు. అనేక మంది హిజ్రాలు ట్రాన్స్ జెండర్లు ఉపాధి, ఉద్యోగ అవకాశాలతో గౌరవంగా జీవిస్తున్నారని, కొందరి ఆగడాలతో అందరి పై మోపడం సరికాదన్నారు. పోలీసు యంత్రాంగం నిజానిజాలు తెలుసుకొని చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వం తమకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

మూడు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆదిలాబాద్ జిల్లా రాజకీయ, సామాజిక మరియు గిరిజన ప్రాంతాల పరిణామాలపై అపారమైన పట్టున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.