Adilabad: ఒకే నంబరుతో రెండు టాటా ఏస్‌లు.. చలాన్ మెసేజ్‌తో యజమాని షాక్!
Adilabad: ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్‌లో ఒకే నంబరుతో రెండు టాటా ఏస్ వాహనాలు తిరుగుతున్న ఘటన కలకలం రేపింది.
Adilabad: ఒకే నంబరుతో రెండు టాటా ఏస్‌లు.. చలాన్ మెసేజ్‌తో యజమాని షాక్!
ఆదిలాబాద్: ఒకే రిజిస్ట్రేషన్ నంబరుతో రెండు వాహనాలు తిరుగుతున్న విచిత్ర సంఘటన ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్‌లో వెలుగు చూసింది. మండల కేంద్రానికి చెందిన పవార్ నాందేవ్ ఈ టాటా ఏస్ వాహనాన్ని కొనుగోలు చేసి, నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే కొన్ని కారణాల వల్ల ఈ వాహనం ఇంకా అతని పేరు మీద రిజిస్ట్రేషన్ కానప్పటికీ, వాహనం మాత్రం నాందేవ్దే.
కాగా నిన్న మధ్యాహ్నం అతను గుడిహత్నూర్‌లో ఉండగా, అతని ఫోన్‌కు ఈ-చలాన్ మెసేజ్ వచ్చింది. బాసర గోదావరి చెక్ పోస్ట్ వద్ద ఫైన్ పడినట్లు ఉన్న ఆ మెసేజ్ చూసి ఆశ్చర్యపోయిన నాందేవ్, ఫోటోను పరిశీలించగా అందులోని టాటా ఏస్ నంబరు, తన వాహనం నంబరు ఒకటేనని గుర్తించి ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు. తన వాహనం నంబరు ప్లేటుతోనే మరొక టాటా ఏస్ వాహనం దర్జాగా తిరుగుతోందని తెలుసుకొని ఈ విషయమై గుడిహత్నూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు నాందేవ్ తెలిపారు.
అలాగే ఆటో యూనియన్ ప్రెసిడెంట్ వసీం ఖాన్ మాట్లాడుతూ... నాందేవ్ నడుపుతున్న వాహనం నంబరును అక్రమంగా వాడుతూ వాహన యజమానిని, ప్రభుత్వాన్ని, పోలీసులను మోసం చేస్తున్న సదరు వ్యక్తిపై అధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.




