Adilabad: ఉట్నూరులో 1,087 మందికి నూతన పెన్షన్ పత్రాల అందజేత!

Adilabad: ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండల కేంద్రంలో 1,087 మంది లబ్ధిదారులకు నూతన పెన్షన్ మంజూరు పత్రాలను ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అందజేశారు. ఇందిరమ్మ జీవిత బీమా పోస్టర్ విడుదల చేశారు.

Y RAMESH, ITDA UTNOOR
Updated on: 18 Nov 2026 2:57 PM IST
Adilabad
X

Adilabad: ఉట్నూరులో 1,087 మందికి నూతన పెన్షన్ పత్రాల అందజేత!

ఆదిలాబాద్: ఉట్నూరు మండల కేంద్రంలో 1,087 మంది లబ్ధిదారులకు నూతన పెన్షన్ మంజూరు పత్రాలను అందచేసిన ఖానాపూర్ ఎమ్మెల్యే, నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షులు వెడ్మ బొజ్జు పటేల్. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యమని తెలిపారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు తదితర అర్హులైన వారికి పెన్షన్లు అందించడం ద్వారా వారికి ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని పేర్కొన్నారు.

అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపటి నుంచి ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని ప్రారంభిస్తున్నారని తెలిపారు. ఈ పథకం ద్వారా అర్హులైన కుటుంబాలకు జీవిత బీమా భరోసా కల్పించనున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ జీవిత బీమా పథకానికి సంబంధించిన పోస్టర్‌ను ఎమ్మెల్యే విడుదల చేశారు.

Y RAMESH, ITDA UTNOOR

Y RAMESH, ITDA UTNOOR