Adilabad: కొలంగూడలో ఘనంగా అమరజీవి కుమరం సూరు వర్ధంతి!

Adilabad: ఉట్నూర్ మండలం కొలంగూడలో కుమరం సూరు 29వ వర్ధంతి ఘనంగా జరిగింది. జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు హుస్సేన్ నాయక్, ఎంపీ నగేష్, కలెక్టర్ రాజర్షి షా పాల్గొని నివాళులర్పించారు.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad
Published on: 4 Nov 2026 8:45 PM IST
Adilabad
X

Adilabad: కొలంగూడలో ఘనంగా అమరజీవి కుమరం సూరు వర్ధంతి!

ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా లో అమరజీవి కుంరం సూరు 29వ వర్ధంతి వేడుకలను వైభవంగా జరుపుకున్నారు.. ఉట్నూర్ మండలం కొలం గూడ గ్రామంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు హుస్సేన్ నాయక్, ఎంపీ గోడం నగేష్, జిల్లా కలెక్టర్ రాజర్షిషా, ఐటీడీఏ పీవో మంద మకరందు, సబ్ కలెక్టర్ ప్రణయ్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా అతిథులు కుంరం సూరు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు హుస్సేన్ నాయక్ మాట్లాడుతూ.. గిరిజనులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యల పరిష్కారం కోసం అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక చొరవ చూపాలని పిలుపునిచ్చారు.

భూ సమస్యలు, అటవీ హక్కుల గుర్తింపునకు సంబంధించి కోర్ ఏరియాలు, భూమి కేటాయింపులు, అటవీ ప్రాంత హక్కులపై అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి తగిన నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. రెవెన్యూ, ఫారెస్ట్, ట్రైబల్ వెల్ఫేర్ శాఖల అధికారులు అందరూ సమన్వయంతో పనిచేసి గిరిజన బిడ్డలకు సకాలంలో న్యాయం జరిగేలా చూడాలని ఆదేశించారు. గిరిజనులు తమకు లభించిన చట్టపరమైన హక్కులను, కోర్టుల ద్వారా లభించే అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

మూడు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆదిలాబాద్ జిల్లా రాజకీయ, సామాజిక మరియు గిరిజన ప్రాంతాల పరిణామాలపై అపారమైన పట్టున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.