Tamsi: జియో నెట్‌వర్క్ లేక బండల్ నాగపూర్ గ్రామస్తుల ఆందోళన

Tamsi: ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలం బండల్ నాగపూర్ గ్రామంలో జియో నెట్‌వర్క్ లేక గ్రామస్తుల ఆందోళన. ఎరువుల బుకింగ్, విద్యార్థులకు ఇబ్బందులు.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad
Published on: 8 Aug 2026 4:54 PM IST
Tamsi
X

Tamsi: జియో నెట్‌వర్క్ లేక బండల్ నాగపూర్ గ్రామస్తుల ఆందోళన

తాంసి: ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలంలోని బండల్ నాగపూర్ లో గత వారం రోజుల నుండి జియో టవర్ ఉండి కూడా నెట్వర్క్ లేకపోవడంతో గ్రామస్తులు ఆందోళనకు దిగారు.

ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ శ్రీకాంత్ మాట్లాడుతూ గత వారం రోజుల నుండి జియో నెట్వర్క్ గ్రామములో లేకపోవడం వల్ల రైతులు తమ పంట పొలాలకు ఎరువులను ఆన్లైన్ బుక్ చేసుకోవడంలో ఇబ్బంది ఏర్పడుతుందని అలాగే ప్రభుత్వం అందించే రేషన్ బియ్యాన్ని తీసుకోలేకపోతున్నామని అలాగే మా గ్రామంలో జ్యోతిబాపూలే ఆశ్రమ పాఠశాల 2000 మంది విద్యార్థులతో నడుస్తుంది.

వాటికి కూడా నెట్వర్క్ లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయని సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు ఫోన్లు చేసిన వారు స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు నెట్వర్క్ రెండు రోజుల్లో పూర్తికానియెడల ఆందోళన కార్యక్రమాలు చేపడతామని అన్నారు.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

మూడు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆదిలాబాద్ జిల్లా రాజకీయ, సామాజిక మరియు గిరిజన ప్రాంతాల పరిణామాలపై అపారమైన పట్టున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story