Adilabad: జొన్న రైతుల గోస.. 10 రోజులుగా యార్డుల్లోనే పడిగాపులు!

Adilabad: ఆదిలాబాద్ జిల్లాలో గన్ని బ్యాగులు, హమాలీల కొరతతో తెల్ల జొన్న కొనుగోళ్లు మందకోడిగా సాగుతున్నాయి.

ANNOJULA SRINIVAS  RAO
Published on: 19 May 2026 10:47 AM IST
Adilabad
X

Adilabad: జొన్న రైతుల గోస.. 10 రోజులుగా యార్డుల్లోనే పడిగాపులు!

అదిలాబాద్: అదిలాబాద్ జిల్లా లో తెల్ల జొన్న రైతుల కష్టాలు వర్ణనాతీతంగా మారుతున్నాయి.. జిల్లాలోని ఆదిలాబాద్ తో పాటు దాదాపు 20 కి పైగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినప్పటికీ గన్ని బ్యాగులు, హమాలి, గోడౌన్ ల కొరత తో పది రోజులుగా పడికాపులు కాస్తున్న ఆశించిన స్థాయిలో కొనుగోలు జరగడం లేదు... ఒక పక్క అకాల వర్షాలు, మరోపక్క రికార్డు స్థాయిలో దంచి కొడుతున్న ఎండలు, మందకోడిగా సాగుతున్న కొనుగోళ్లతో రైతుల్లో ఆందోళన వ్యక్తం అవుతుంది.. జొన్న నిల్వలు యాడ్ల్లో పెరిగిపోవడం కారణంగా దాదాపు రెండు మూడు రోజులపాటు కొనుగోలు నిలిపివేస్తున్నట్లు, కొనుగోలు తేదీ ప్రకటించే వరకు జొన్నలు తీసుకురావద్దని రైతులకు అధికారులు సూచిస్తున్నారు.. మొత్తంగా కొనుగోలు లేక జొన్న రైతుల్లో అయోమయ పరిస్థితి నెలకొంది.

ANNOJULA SRINIVAS  RAO

ANNOJULA SRINIVAS RAO

Next Story