Nirmal: నిర్మల్‌లో విజయవంతంగా పేస్‌మేకర్ అమరిక.. డాక్టర్ రమేష్ రెడ్డి వెల్లడి!

Nirmal: నిర్మల్ జిల్లా కేంద్రంలోని తిరుమల నర్సింగ్ హోమ్‌లో ప్రముఖ గుండె వైద్య నిపుణులు డాక్టర్ కృష్ణ కిషోర్ రెడ్డి ఆధ్వర్యంలో వృద్ధురాలికి విజయవంతంగా పేస్‌మేకర్ అమర్చారు.

THAKUR ANANTH RAM SING, NIRMAL
Published on: 2 Nov 2026 1:32 PM IST
Nirmal
X

Nirmal: నిర్మల్‌లో విజయవంతంగా పేస్‌మేకర్ అమరిక.. డాక్టర్ రమేష్ రెడ్డి వెల్లడి!

Nirmal: నిర్మల్ జిల్లా కేంద్రంలోని డాక్టర్ రమేష్ రెడ్డి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో ప్రముఖ గుండె వైద్య నిపుణులు డాక్టర్ కృష్ణ కిషోర్ రెడ్డి వైద్య సేవలు అందుబాటులోకి వచ్చినట్లు డాక్టర్ రమేష్ రెడ్డి పేర్కొన్నారు. గత 30 సంవత్సరాల గుండె వైద్య సేవలో అనుభవమున్న డాక్టర్ కృష్ణ కిషోర్ రెడ్డి 24 గంటలు తిరుమల నర్సింగ్ హోమ్ లో అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు.

హైదరాబాదులోని కార్పొరేట్ ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న అత్యాధునిక వైద్య సేవలైన పేస్ మేకర్ అమర్చే ఆపరేషన్లు సైతం నిర్మల్లో చేయనున్నట్లు ఆయన తెలిపారు. గత కొన్ని రోజుల క్రితం నిర్మల్ జిల్లా లక్ష్మణ చాంద మండలం పీచర ధర్మారం గ్రామానికి చెందిన 75 సంవత్సరాల మల్లవ్వ అనే మహిళ గుండె సంబంధిత వ్యాధితో ఆసుపత్రికి వచ్చినట్లు తెలిపారు.

ఆమెకు పేస్ మేకర్ అవసరం ఉండడంతో డాక్టర్ కృష్ణ కిషోర్ రెడ్డి వైద్య నిపుణుల బృందం నిర్మల్ లోనే ఆపరేషన్ నిర్వహించి అమర్చినట్లు తెలిపారు. హైదరాబాద్ లాంటి పెద్ద పెద్ద నగరాల్లో ఈ ఆపరేషన్కు ఏడు నుంచి పది లక్షలు ఖర్చు అవుతాయని, నిర్మల్ లోని తిరుమల నర్సింగ్ హోమ్ లో కేవలం లక్ష 50 వేలకే చేసినట్లు తెలిపారు.

ప్రస్తుతం మల్లవ్వ ఆరోగ్య పరిస్థితి బాగానే ఉన్నట్లు పేర్కొన్నారు. నిర్మల్ జిల్లా ప్రజలు సదావకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన పేర్కొన్నారు. మల్లవ్వకు ఆపరేషన్ చేసి పేస్ మేకర్ అమర్చిన కేకేఆర్ వైద్య బృందానికి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

THAKUR ANANTH RAM SING, NIRMAL

THAKUR ANANTH RAM SING, NIRMAL