Adilabad: ఆదిలాబాద్‌లో ‘యోగ వాక్’.. ఒత్తిడికి యోగాతోనే చెక్!

Adilabad: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆదిలాబాద్‌లో ఆయుష్ ఆధ్వర్యంలో 'యోగ వాక్' నిర్వహించారు.

CHANDRAMOHAN, KADAPA
Published on: 18 Jun 2026 2:27 PM IST
Adilabad
X

Adilabad: ఆదిలాబాద్‌లో ‘యోగ వాక్’.. ఒత్తిడికి యోగాతోనే చెక్!

ఆదిలాబాద్: యోగా ద్వారా సంపూర్ణ ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత లభిస్తుందని మున్సిపల్ ఛైర్ పర్సన్ అనూష అన్నారు.

వరల్డ్ యోగా డేను పురస్కరించుకుని ఆయుష్, మేరా యువ భారత్ కేంద్రం ఆధ్వర్యంలో గురువారం ఆదిలాబాద్‌లో యోగ వాక్ నిర్వహించారు.

ఈ వాక్‌ను డీఎంహెచ్‌వో సాధన, రిమ్స్ డైరెక్టర్ జై సింగ్ రాథోడ్‌తో కలిసి ఛైర్ పర్సన్ ప్రారంభించారు. ఉరుకుల పరుగుల జీవితంలో ఒత్తిడిని జయించాలంటే ప్రతి ఒక్కరూ యోగాను అలవాటు చేసుకోవాలని సూచించారు.

ఏజెన్సీ అడిషనల్ డీఎంహెచ్ఓ మనోహర్, ఆయుష్ శాఖ వైద్యులు, నర్సింగ్ విద్యార్థులు తదితరులు ఉన్నారు.

CHANDRAMOHAN, KADAPA

CHANDRAMOHAN, KADAPA

29 ఏళ్లుగా నిజాయితీ గల జర్నలిజమే శ్వాసగా, సమాజ గొంతుకగా నిలుస్తున్న సీనియర్ పాత్రికేయులు.