Adilabad: ఆదిలాబాద్‌లో ఏఐటీయూసీ భారీ కార్మిక ర్యాలీ
Adilabad: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తూ కార్మిక సంక్షేమాన్ని పాతరేస్తోందని AITUC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలరాజు ధ్వజమెత్తారు.
Adilabad: ఆదిలాబాద్‌లో ఏఐటీయూసీ భారీ కార్మిక ర్యాలీ
Adilabad: కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు వత్తాసు పలుకుతూ.. కార్మికుల సంక్షేమాన్ని విస్మరిస్తున్నదని ఎఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలరాజు ఆరోపించారు. ఆదివారం ఆదిలాబాద్ లో నిర్వహించిన ఎఐటియుసి జిల్లా మహాసభలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
ముందుగా పట్టణంలో కార్మికులు మహా ర్యాలీ ప్రదర్శన చేపట్టారు. అనంతరం బజరంగ్ ఫంక్షన్ హాల్ లో సంఘం మహాసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేసి.. పాత కార్మిక చట్టాల యధావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం సైతం కార్మిక విధులకు విధానాలను అవలంబిస్తున్నదని ఆరోపించారు. కార్మికులను కనీస వేతనం అమలుతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎఐటియుసి రాష్ట్ర కార్యదర్శి విలాస్, జిల్లా కార్యదర్శి సిర్ర దేవేందర్, వివిధ సంఘాల ప్రతినిధులు కార్మికులు హాజరయ్యారు.




