Adilabad: మధ్యాహ్న భోజన కార్మికుల హామీలు నెరవేర్చాలి!

Adilabad: ఆదిలాబాద్ లో మధ్యాహ్న భోజన పథకం కార్మికుల 4వ మహాసభలు. కార్మికులకు కనీస వేతనం, ఉద్యోగ భద్రత కల్పించాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి డిమాండ్.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad
Published on: 12 July 2026 3:07 PM IST
Adilabad
X

Adilabad: మధ్యాహ్న భోజన కార్మికుల హామీలు నెరవేర్చాలి!

Adilabad: మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు ప్రేమపావని డిమాండ్ చేశారు. ఆదివారం ఆదిలాబాద్ లోని బజరంగ్ హాల్ లో నిర్వహించిన సంఘం జిల్లా 4వ మహాసభలు ఆమె మాట్లాడారు.

మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే ప్రయత్నాలను విరమించుకోవాలని హెచ్చరించారు. కార్మికులకు కనీస వేతనంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. ఈ సమావేశంలో ఏఐటియుసి రాష్ట్ర కార్యదర్శి విలాస్, జిల్లా కార్యదర్శి సిర్ర దేవేందర్, సభ్యులు తదితరులు ఉన్నారు.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

మూడు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆదిలాబాద్ జిల్లా రాజకీయ, సామాజిక మరియు గిరిజన ప్రాంతాల పరిణామాలపై అపారమైన పట్టున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story