Adilabad: తెలంగాణ హామీలపై ప్రధాని మోదీని ప్రశ్నించిన ఏఐవైఎఫ్
Adilabad: తెలంగాణకు ఇచ్చిన విభజన హామీలు, ఉద్యోగాల హామీపై ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని ఏఐవైఎఫ్ డిమాండ్ చేసింది.
Adilabad
Adilabad: తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన విభజన హామీలు నెరవేర్చాలని ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి మెస్రం భాస్కర్ అన్నారు. ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన నేపథ్యంలో ఆయన ఇచ్చిన హామీలపై బహిరంగ లేఖ ద్వారా సమాధానం అడుగుతున్నామని అన్నారు. ఇందులో భాగంగా ఆదిలాబాద్ లో సంఘ కార్యాలయం ముందు బహిరంగ లేఖ విడుదల చేశారు. యువతకు ప్రధాని నరేంద్ర మోడీ 2014 ఎన్నికల సమయంలో ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తామని ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు
Next Story




