Nirmal: నిర్మల్‌లో నేడు బీజేపీ ‘లోక్‌తంత్ర బచావో’ మహా పాదయాత్ర!

Nirmal: నిర్మల్‌లో నేడు బీజేపీ ఆధ్వర్యంలో 'లోక్‌తంత్ర బచావో - అరాచకత హటావో' మహా పాదయాత్ర.

THAKUR ANANTH RAM SING, NIRMAL
Published on: 3 Nov 2026 10:23 AM IST
Nirmal
X

Nirmal: నిర్మల్‌లో నేడు బీజేపీ ‘లోక్‌తంత్ర బచావో’ మహా పాదయాత్ర!

Nirmal: భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నేడు నిర్మల్ పట్టణంలో నిర్వహించనున్న లోక్‌తంత్ర బచావో – అరాచకత హటావో అనే నినాదంతో చేపట్టనున్న మహా పాదయాత్రకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మహా పాదయాత్ర నేపథ్యంలో నిర్మల్ పట్టణం కాషాయ జెండాలు, తోరణాలు, ఫ్లెక్సీలతో కాషాయమయంగా మారింది. దీంతో బీజేపీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నెలకొంది.

ఈ మహా పాదయాత్రకు బీజేపీ జాతీయ నాయకులు, కేంద్ర మంత్రులు హాజరుకానుండటంతో కార్యక్రమంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ప్రజాస్వామ్య పరిరక్షణ, రాజ్యాంగ సంస్థల గౌరవం కోసం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీజేపీ నాయకులు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు.

ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం చేపడుతున్న ఈ మహా పాదయాత్రకు ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు, బీజేపీ కార్యకర్తలు, నాయకులు భారీ సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని, నిర్మల్ గడ్డపై కాషాయ జెండా రెపరెపలాడేలా ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని బి జె ఎల్ పి నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి పిలుపునిచ్చారు.

మహా పాదయాత్ర సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్కు ఇలాంటి అంతరాయం కలగకుండా వాహనాలను దారి మళ్లించేందుకు అన్ని చర్యలు చేపట్టారు.

THAKUR ANANTH RAM SING, NIRMAL

THAKUR ANANTH RAM SING, NIRMAL