Nirmal: వాస్తపూర్లో గుస్సాడీ దీపావళి: అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి
Nirmal: నిర్మల్ జిల్లా వాస్తపూర్ గ్రామంలో నిర్వహించిన గుస్సాడీ దీపావళి వేడుకల్లో మాజీమంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొని కళాకారులతో కలిసి నృత్యం చేశారు.
Nirmal: వాస్తపూర్లో గుస్సాడీ దీపావళి: అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి
నిర్మల్: గిరిజన సంస్కృతి, సంప్రదాయాలకు గుస్సాడీ నృత్యం ప్రతీకగా నిలుస్తుందని, తరతరాలుగా వస్తున్న ఈ కళారూపాన్ని భావితరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపై మాజీమంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు.
నిర్మల్ జిల్లా వాస్తపూర్ గ్రామంలో గుస్సాడీ దీపావళి వేడుకలు సంప్రదాయబద్ధంగా ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొని గుస్సాడీ కళాకారుల నృత్య ప్రదర్శనలను తిలకించారు. కళాకారులతో కలిసి అడుగులు కలిపారు.
ఈ సందర్భంగా కళాకారులను ఆప్యాయంగా పలకరించి వారికి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. గిరిజనుల ఆచార వ్యవహారాలు, సంస్కృతి సంప్రదాయాలు తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపునిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, గుస్సాడీ కళాకారులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.




