Tamsi: తాంసి జొన్న కొనుగోలు కేంద్రంలో మార్కెట్ చైర్మన్ ఆకస్మిక తనిఖీ

Tamsi: ఆదిలాబాద్ జిల్లా తాంసి మండల కేంద్రంలోని తెల్ల జొన్నల కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి తనిఖీ చేశారు.

ANNOJULA SRINIVAS  RAO
Published on: 12 May 2026 3:13 PM IST
Tamsi
X

Tamsi: తాంసి జొన్న కొనుగోలు కేంద్రంలో మార్కెట్ చైర్మన్ ఆకస్మిక తనిఖీ

తాంసి: అదిలాబాద్ జిల్లా తాంసి మండల కేంద్రంలోని తెల్ల జొన్నల కొనుగోలు కేంద్రాన్ని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి జొన్నలతో పాటు ఇతర ఏ పంటలు సాగు చేశారో అడిగి తెలుసుకున్నారు. ఈ ఏడాది పంట దిగుబడి ఎలా ఉందని, ఇటీవల కురిసిన అకాల వర్షాల ప్రభావం ఏమైనా ఉందా అని రైతులను ప్రశ్నించారు. అనంతరం రైతులు షెడ్యూల్ ప్రకారం ధాన్యాన్ని మార్కెట్ యార్డుకు తీసుకురావాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా తనను సంప్రదించాలని తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జొన్న కొనుగోళ్లు చేపట్టాలని మార్కెట్ సిబ్బందికి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ సభ్యులు, పలువురు నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

ANNOJULA SRINIVAS  RAO

ANNOJULA SRINIVAS RAO

Next Story