Nirmal: వాసవి సేవాదళ్ రాష్ట్ర వైస్ చైర్మన్‌గా ఆమెడ శ్రీధర్ నియామకం!
Nirmal: నిర్మల్‌కు చెందిన వ్యాపారి ఆమెడ శ్రీధర్ వాసవి సేవాదళ్ రాష్ట్ర వైస్ చైర్మన్‌గా నియమితులయ్యారు. మహంకాళి విజయ్ కుమార్ గుప్తా పత్రం అందజేశారు.
Nirmal: వాసవి సేవాదళ్ రాష్ట్ర వైస్ చైర్మన్‌గా ఆమెడ శ్రీధర్ నియామకం!
నిర్మల్: నిర్మల్ పట్టణ కి చెందిన ప్రముఖ వ్యాపారి ఆమెడ శ్రీధర్ ఆర్యవైశ్య మహాసభ వాసవి సేవాదళ్ వైస్ చైర్మన్ గా నియమితులయ్యారు.
ఈయనకు నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్యవైశ్య సంఘంలో ఏర్పాటు చేసిన దుర్గామాత వద్ద రాష్ట్ర వాసవి సేవాదళం అధ్యక్షులు మహంకాళి విజయ్ కుమార్ గుప్తా నియామక పత్రాన్ని అందజేశారు.
ముందుగా దుర్గామాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహా సభ ఉపాధ్యక్షులు మొటూరి మురళి గుప్తా, మహా సభ కార్యదర్శి పోలా సుధాకర్ గుప్తా, రాష్ట్ర పొలిటికల్ వైస్ చైర్మన్ లింగంపల్లి లక్ష్మి నారాయణ, రాష్ట్ర E.C మెంబెర్ పాల్డ్ మహేందర్ తదితరులు పాల్గొన్నారు.




