Ichoda: పోడు భూములు, షాదీఖానాపై మంత్రికి బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్!
Ichoda: పోడు భూముల సమస్యలు, ఇచ్చోడలో షాదీఖానా మంజూరుపై రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అజారుద్దీన్‌ను ఎమ్మెల్యే అనిల్ జాదవ్ కలిసి వినతిపత్రం అందజేశారు.
Ichoda: పోడు భూములు, షాదీఖానాపై మంత్రికి బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్!
ఇచ్చోడ: బోథ్ నియోజకవర్గంలోని పలు ప్రజా సమస్యల పరిష్కారం కొరకు సోమవారం ఎమ్మెల్యే అనిల్ జాదవ్ రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అజారుద్దీన్‌ను మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు.
ఇచ్చోడ, గుడిహత్నూర్ మండలాల పరిధిలోని కేశవపట్నం, బాబ్జిపెట్, గుండాల, లింగాపూర్, జోగిపేట్ గ్రామాల్లో రైతులు ఎదుర్కొంటున్న పోడు భూముల సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
అర్హులైన రైతులకు అటవీ హక్కుల చట్టం ప్రకారం త్వరగా పట్టాలు పంపిణీ చేయాలని కోరారు.
అలాగే ఇచ్చోడ మండల కేంద్రంలో షాదీఖానా మంజూరు చేయాలని, నియోజకవర్గంలోని ముస్లిం ఖబరస్తాన్లు, ఈద్గాలకు కాంపౌండ్ వాల్స్ నిర్మించాలని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు, ఎమ్మెల్యే వినతిపై సానుకూలంగా స్పందించిన మంత్రి అజారుద్దీన్, సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించి సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో కేశవపట్నం సర్పంచ్ అల్తాఫ్, సదర్ ఇబ్రహీం, సాదిక్, జూమ్మ తదితరులు పాల్గొన్నారు.




