Nirmal: నిర్మల్‌లో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నవరాత్రులు!

Nirmal: నిర్మల్ జిల్లా కేంద్రంలో పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం. దుర్గామాత విగ్రహ ప్రతిష్టాపన, బతుకమ్మ సంబురాలు, కోలాటాలు.

THAKUR ANANTH RAM SING, NIRMAL
Published on: 11 Oct 2026 7:54 PM IST
Nirmal
X

Nirmal: నిర్మల్‌లో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నవరాత్రులు!

Nirmal: నిర్మల్ జిల్లా కేంద్రంలో పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. జిల్లా కేంద్రంలోని నాయిడివాడ చౌరస్తాలో గల సంఘ భవనంలో దుర్గామాత విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారి ఊరేగింపు కార్యక్రమాన్ని కన్నుల పండుగగా చేపట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బతుకమ్మ వేడుకలను ప్రారంభించారు. అనంతరం మహిళలు కోలాటాలు వేస్తూ బతుకమ్మ పాటలను పాడుతూ నృత్యాలు చేశారు.

ఆమెడ శ్రీధర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. అమ్మవారి పూజ అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. నవరాత్రి ఉత్సవాల్లో ప్రతిరోజు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తూ దాండియా తో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆమెడ శ్రీధర్(లడ్డు సెట్) పేర్కొన్నారు.

THAKUR ANANTH RAM SING, NIRMAL

THAKUR ANANTH RAM SING, NIRMAL