Asifabad: ఆసిఫాబాద్‌లో నిషేధిత గడ్డి మందు అక్రమ రవాణా.. ఇద్దరు అరెస్ట్!
Asifabad: మహారాష్ట్ర నుంచి అక్రమంగా నిషేధిత గడ్డి మందు తరలిస్తున్న ఇద్దరిని కృష్ణపల్లి బ్రిడ్జి వద్ద బెజ్జూర్ పోలీసులు పట్టుకున్నారు. 20 లీటర్ల క్యాన్లు, స్కూటీ స్వాధీనం.
Asifabad: ఆసిఫాబాద్‌లో నిషేధిత గడ్డి మందు అక్రమ రవాణా.. ఇద్దరు అరెస్ట్!
Asifabad: బెజ్జూర్ మండల సులుగుపల్లి గ్రామ నివాసులయిన బోర్కుట్ పురుషోత్తం మరియు డేటి సుధాకర్ అను ఇద్దరూ మహారాష్ట్ర రాష్ట్రంలోని అహేరి ప్రాంతం నుంచి నిషేధిత గడ్డి మందును కొనుగోలు చేసి, 20 లీటర్ల సామర్థ్యం కలిగిన రెండు క్యాన్లలో తీసుకువచ్చారు.
సులుగుపల్లి గ్రామం మరియు పరిసర ప్రాంతాల్లో ప్రజలను మోసం చేసే ఉద్దేశంతో నిషేధిత గడ్డి మందును విక్రయించేందుకు తరలిస్తున్న సమయంలో, విశ్వసనీయ సమాచారం మేరకు బెజ్జూర్ పోలీసులు కృష్ణపల్లి బ్రిడ్జి వద్ద పట్టుకున్నారు.
వారి వద్ద ఉన్న నిషేధిత గడ్డి మందుతో కూడిన 20 లీటర్ల రెండు క్యాన్లను, అలాగే రెండు మొబైల్ ఫోన్లను ఒక స్కూటీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఘటనపై బెజ్జూర్ పోలీసులు కేసు నమోదు చేసి, తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
నిషేధిత మందులు, అక్రమ వ్యవసాయ ఉత్పత్తుల విక్రయాలు లేదా రవాణాకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.




