Asifabad: ప్రజల ఆరోగ్యమే పోలీసుల ప్రాధాన్యం ఎస్పీ నితికా పంత్ ఐపీఎస్
Asifabad: కొమరం భీం జిల్లా బెజ్జూర్‌లో పోలీస్ శాఖ, మంచిర్యాల మెడిలైఫ్ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు.
Asifabad: ప్రజల ఆరోగ్యమే పోలీసుల ప్రాధాన్యం ఎస్పీ నితికా పంత్ ఐపీఎస్
ఆసిఫాబాద్: కొమరం భీం జిల్లా బెజ్జుర్ పోలీసుల ఆధ్వర్యంలో, మెడిలైఫ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, మంచిర్యాల వారి సహకారంతో ప్రభుత్వ గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాల వద్ద ఆదివారం ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ నితికా పంత్ ఐపీఎస్ హాజరై మెగా మెడికల్ క్యాంపును ప్రారంభించారు.
ఈ మెడికల్ క్యాంపులో సుమారు 500 మంది ప్రజలు పాల్గొని ఈసీజీ, 2డీ ఇకో, షుగర్ పరీక్షలు, బీపీ చెక్‌అప్, కంటి పరీక్షలు వంటి వివిధ వైద్య పరీక్షలు చేయించుకున్నారు. జనరల్ మెడిసిన్, పల్మనాలజీ, ఆర్తోపెడిక్, గైనకాలజీ,రేడియోలజీ, జనరల్ సర్జరీ, న్యూరో ఫిజీషియన్, డెంటల్, ఇ.ఎన్.టి వైద్యులు చికిత్సలు నిర్వహించారు. కంటి అద్దాలు అవసరమైన 50 మందికి అందించారు.
ఈ సందర్భంగా ఎస్పీ నితికా పంత్ మాట్లాడుతూ... ప్రజలు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, ముందస్తు పరీక్షలు చేయించుకోవడం ద్వారా అనేక వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించి నివారించవచ్చని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడం కోసం ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలు ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు.
అలాగే ప్రజలకు పోలీసులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని, ఏ సమస్య వచ్చినా సమీప పోలీస్ స్టేషన్‌ను లేదా డయల్ 100ను సంప్రదించాలని సూచించారు. పోలీసు శాఖ ప్రజల భద్రతతో పాటు వారి ఆరోగ్య సంక్షేమం పట్ల కూడా బాధ్యతతో పనిచేస్తుందని, భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలిపారు.




