Nirmal: భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ!
Nirmal: మూల నక్షత్రం సందర్భంగా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయంలో భక్తుల రద్దీ. పోలీసు బందోబస్తు, భద్రతా ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించిన ఎస్పీ జానకి షర్మిల.
Nirmal: భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ!
Nirmal: బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో మూల నక్షత్రం సందర్భంగా నిర్వహిస్తున్న మహా అక్షరాభ్యాస కార్యక్రమానికి భారీగా భక్తులు తరలివస్తున్న నేపథ్యంలో నిర్మల్ జిల్లా పోలీసు శాఖ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసింది. ఆలయ పునర్నిర్మాణ పనుల కారణంగా ఈసారి ఉత్సవాలు బాలాలయంలో నిర్వహిస్తున్నారు.
జిల్లా ఎస్పీ జానకి షర్మిల అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అదనపు ఎస్పీ ఉపేందర్ రెడ్డి, భైంసా ఏఎస్పీ సాయి కిరణ్, నిర్మల్ డీఎస్పీ పి. శ్రీనివాస్లతో కలిసి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. సుమారు 200 మంది పోలీసు సిబ్బందితో నిర్వహిస్తున్న బందోబస్తును సమీక్షించి, భక్తుల రద్దీకి అనుగుణంగా అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలని సూచించారు.
గోదావరి ఘాట్లు, అక్షరాభ్యాస మండపాలు, క్యూలైన్లు, ట్రాఫిక్, పార్కింగ్ ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఉంచాలని ఆదేశించారు. నీటి ప్రవాహం ఉధృతంగా ఉన్న ప్రాంతాల్లోకి భక్తులు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, చిన్నారులు, మహిళలు, వృద్ధుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
భక్తులు పోలీసుల సూచనలు పాటిస్తూ, వారికి సహకరించి ప్రశాంతంగా అమ్మవారిని దర్శించుకోవాలని, తమ చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించుకోవాలని సూచించారు.




