Basara: బాసరలో భక్తుల రద్దీ.. గోదావరి తీరాన ఘనంగా కార్తీక దీపోత్సవం

Basara: కార్తీక శుక్రవారం కావడంతో బాసర సరస్వతి అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి కార్తీక దీపాలు వెలిగించారు.

RAMESH RATNELLI, BASARA
Published on: 13 Nov 2026 5:13 PM IST
Basara
X

Basara: బాసరలో భక్తుల రద్దీ.. గోదావరి తీరాన ఘనంగా కార్తీక దీపోత్సవం

బాసర: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర సరస్వతి అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. కార్తీక మాసం శుక్రవారం కావడం తో గోదావరి నది తీరం భక్తులతో కిటకిటలాడింది. గోదావరి నదిలో పుణ్య స్నానాలు ఆచరించి కార్తీక దీపాలు వెలిగించేందుకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. వేకువజామున నుండే భక్తులు గోదావరి నదిలో పుణ్య స్నానాలు ఆచరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

కార్తీక మాసం కావడంతో పరమశివుడికి అత్యంత ప్రీతికరమైన కార్తికమాసంలో పవిత్ర గోదావరి నదిలో పుణ్యస్నానాలు చేసి నది తీరాన ఉన్న శ్రీ సూర్యేశ్వర ఆలయం లో ప్రత్యేక పూజలు చేశారు.

గోదావరమ్మ తల్లికి మహిళా భక్తులు కార్తిక మాసం దీపాలు వెలిగించి పసుపు, కుంకుమలను ఒకరికొకరు అందజేసుకొని వాయినాలు ఇచ్చుకున్నారు.

తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి ఆలయ అక్షరాభ్యాస మండపంలో అక్షర శ్రీకార పూజలు నిర్వహించిన అనంతరం సరస్వతి అమ్మవారిని దర్శించుకుని, భక్తులు కుంకుమార్చన పూజలు నిర్వహించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు...

RAMESH RATNELLI, BASARA

RAMESH RATNELLI, BASARA