Basara: బాసర ఆలయ పునర్నిర్మాణం.. గర్భగుడి విస్తరణ పనులు ప్రారంభం!

Basara: నిర్మల్ జిల్లాలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ పునర్నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad
Published on: 5 July 2026 10:44 AM IST
Basara
X

Basara: బాసర ఆలయ పునర్నిర్మాణం.. గర్భగుడి విస్తరణ పనులు ప్రారంభం!

Basara: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో సరస్వతి, మహాకాళి, మహాలక్ష్మి అమ్మవార్లకు శృంగేరి పీఠాధిపతి శిష్యులు, ఆలయ అర్చక వైదిక బృందం కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకువజామునే నదీజలాలతో అభిషేకం, మహాహారతి జరిపారు.

ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా నేటి నుండి గర్భగుడి విస్తరణ పనులు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో మూలవిరాట్టు చివరి రోజు దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

ఇదిలా ఉంటే ఇవాళ మధ్యాహ్నం 12 గంటల నుండి అమ్మవారి మూల విరాట్టు దర్శనాలను నిలిపివేసి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బాలాలయం లో ముగ్గురమ్మ ల దర్శనం కల్పించునున్నారు ఆలయ అధికారులు.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

మూడు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆదిలాబాద్ జిల్లా రాజకీయ, సామాజిక మరియు గిరిజన ప్రాంతాల పరిణామాలపై అపారమైన పట్టున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story