Nirmal: బాసర జ్ఞాన సరస్వతి ఆలయ గర్భాలయ పునర్నిర్మాణ పనులకు శ్రీకారం!
Nirmal: నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయంలో గర్భాలయ పునర్నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. మూలా నక్షత్ర ముహూర్తాన ప్రథమ శిల స్థాపన పూజలు నిర్వహించారు.
Nirmal: బాసర జ్ఞాన సరస్వతి ఆలయ గర్భాలయ పునర్నిర్మాణ పనులకు శ్రీకారం!
నిర్మల్ జిల్లా: బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయంలో గర్భాలయ పునర్నిర్మాణ పనుల శ్రీకారం చుట్టారు.. ఈ పునర్నిర్మాణ పనులలో అత్యంత కీలక ఘట్టమైన గర్భాలయ ప్రథమ శిల స్థాపన పూజా కార్యక్రమం వైదిక మంత్రోచ్ఛారణల నడుమ శాస్త్రోక్తంగా చేపట్టారు. ఈరోజు ఉదయం మూలా నక్షత్రం శుభ ముహూర్తం ఉండడంతో కృష్ణశిల పనులకు శంకుస్థాపన చేసిన ఆలయ అర్చకులు.
గర్బాలయ నిర్మాణ దాతలు సురపనేని సునంద్, పద్మప్రియ దంపతుల చేతుల మీదుగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. నేటి నుంచి కృష్ణశిలలతో గర్భాలయ నిర్మాణ పనులను ప్రారంభమవుతాయని దేవస్థాన కార్యనిర్వణాధికారి అంజనీ దేవి తెలిపారు. భవిష్యత్తులో భక్తులకు మరింత ఆధ్యాత్మిక వైభవానికి చాటి చెప్పేలా ఆలయ ప్రాచీన సంప్రదాయాలు మరియు ఆగమ శాస్త్ర నియమాలను అనుగుణంగా శృంగేరి జగద్గురులు ఆజ్ఞ మేరకు పునర్నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు.




