Bazarhatnoor: వర్షాల కోసం బజార్‌హత్నూర్‌లో కప్పతల్లి ఆటల పూజలు!

Bazarhatnoor: ఆదిలాబాద్ జిల్లా వర్తమన్నూర్‌లో వర్షాలు సమృద్ధిగా కురవాలని గ్రామస్తులు సంప్రదాయబద్ధంగా కప్పతల్లి ఆటలు నిర్వహించి వరుణ దేవుడికి పూజలు చేశారు.

NAGULA SATISH, BOATH
Published on: 28 Jun 2026 2:53 PM IST
Bazarhatnoor
X

Bazarhatnoor: వర్షాల కోసం బజార్‌హత్నూర్‌లో కప్పతల్లి ఆటల పూజలు!

బజార్‌హత్నూర్: సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు పండాలని ఆకాంక్షిస్తూ ఆదిలాబాద్ జిల్లా బజార్‌హత్నూర్ మండలంలోని వర్తమన్నూర్ గ్రామంలో ఆదివారం గ్రామస్తులు సంప్రదాయబద్ధంగా కప్పతల్లి ఆటలు నిర్వహించారు.

ఇటీవల సరైన వర్షాలు లేక విత్తనాలు వేసిన రైతులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో, వరుణ దేవుడి కరుణ కోసం గ్రామంలో ఈ ప్రత్యేక పూజలు చేపట్టారు. ఉదయం నుంచే మహిళలు, యువకులు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొని కప్పతల్లిని అలంకరించి గ్రామ వీధుల్లో ఊరేగించారు. ప్రతి ఇంటి ముందు మహిళలు నీళ్లు పోసి కప్పతల్లికి స్వాగతం పలికారు.

​అనంతరం గ్రామ దేవతల ఆలయాల్లో పాలు, నీటితో జలాభిషేకాలు చేసి నైవేద్యాలు సమర్పించారు. కప్పతల్లి ఆటలు నిర్వహిస్తే వర్ష దేవుడు ప్రసన్నమై సమృద్ధిగా వర్షాలు కురుస్తాయనే నమ్మకం పూర్వకాలం నుంచి వస్తోందని గ్రామ పెద్దలు తెలిపారు.

ప్రకృతిపై విశ్వాసానికి, గ్రామీణ సంస్కృతికి అద్దం పట్టే ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సిడం ప్రభాకర్, మాజీ సర్పంచులు, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

NAGULA SATISH, BOATH

NAGULA SATISH, BOATH

Next Story