Asifabad: కాగజ్‌నగర్‌లో తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనం!

Asifabad: తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్‌ను బెజ్జూర్ మండలానికి చెందిన ఉద్యమకారులు మర్యాదపూర్వకంగా కలిశారు.

SRINIVAS, KOUTALA
Published on: 26 July 2026 7:25 PM IST
Asifabad
X

Asifabad: కాగజ్‌నగర్‌లో తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనం!

ఆసిఫాబాద్: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని పటేల్ గార్డెన్‌లో ఈరోజు నిర్వహించిన తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనం*కు ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఎమ్మెల్సీ కోదండరామ్ ను బెజ్జూర్ మండలానికి చెందిన తెలంగాణ ఉద్యమకారులు మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా వారు ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. గత ప్రభుత్వం ఉద్యమకారులను పట్టించుకోలేదని, ప్రస్తుతం ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారుల ఆకాంక్షలను నెరవేర్చేందుకు కమిటీని ఏర్పాటు చేసిందని తెలిపారు.కమిటీ సభ్యులుగా ఉన్న కోదండరామ్ మండలంలోని ఉద్యమకారులకు న్యాయం చేసి వారి సమస్యలను పరిష్కరించాలని విన్నవించారు.

SRINIVAS, KOUTALA

SRINIVAS, KOUTALA

Next Story