Bellampalli: ఎమ్మెల్యే గడ్డం వినోద్‌తో అటవీ శాఖ అధికారుల భేటీ!

Bellampalli: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అటవీ శాఖ అధికారులతో ఎమ్మెల్యే గడ్డం వినోద్ సమావేశమై అభివృద్ధిపై చర్చించారు.

PRATHAP, BELLAMPALLI
Published on: 12 Aug 2026 11:05 AM IST
Bellampalli
X

Bellampalli: ఎమ్మెల్యే గడ్డం వినోద్‌తో అటవీ శాఖ అధికారుల భేటీ!

Bellampalli: బెల్లంపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అటవీ శాఖ అధికారులు ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామిని మర్యాదపూర్వకంగా కలిశారు. డీఎఫ్‌ఓ రాహుల్ కిషన్ జాదవ్, ఎఫ్‌డీవో విజయ్, ఎఫ్‌ఆర్‌ఓ పూర్ణచందర్ ఎమ్మెల్యేతో నియోజకవర్గానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు.

అనంతరం అటవీ శాఖ అధికారులు ఎమ్మెల్యేను శాలువాతో సత్కరించి మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధికి అన్ని ప్రభుత్వ శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా శాఖల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేయాలని, ప్రజల సంక్షేమం, నియోజకవర్గ సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడంలో అధికారులు భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

PRATHAP, BELLAMPALLI

PRATHAP, BELLAMPALLI

Next Story