Mancherial: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో రాము ఫోటోగ్రఫీ ప్రస్థానం!

Mancherial: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన ఫోటోగ్రాఫర్ రాము గత 28 ఏళ్లుగా ఫోటోగ్రఫీని తన జీవనాధారంగా మలుచుకుని ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial
Updated on: 19 Aug 2026 10:24 AM IST
Mancherial
X

Mancherial: 2మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో రాము ఫోటోగ్రఫీ ప్రస్థానం!

Mancherial: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఒక్క క్లిక్‌తో ఓ జ్ఞాపకాన్ని పదిలం చేయడం.. ఓ క్షణాన్ని జీవితాంతం గుర్తుండిపోయేలా మలచడం.. ఇదే ఫోటోగ్రఫీ గొప్పతనం. అలాంటి కళను తన వృత్తిగా ఎంచుకుని 28 ఏళ్లుగా కొనసాగిస్తున్నారు బెల్లంపల్లికి చెందిన రవివర్మ స్టూడియో ఫోటోగ్రాఫర్ రాము.

చిన్న వయసులోనే కెమెరాపై ఆసక్తి పెంచుకున్న రాము.. కేవలం 12 ఏళ్ల వయసు నుంచే ఫోటోగ్రఫీలో అడుగుపెట్టారు. అప్పటి నుంచి కెమెరానే నేస్తంగా, ఫోటోగ్రఫీనే వృత్తిగా చేసుకుని ముందుకు సాగుతున్నారు. ఎన్నో ఏళ్ల అనుభవంతో ఆయన తీసే చిత్రాలు ప్రత్యేకతను సంతరించుకుంటూ అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

మారుతున్న కాలానికి అనుగుణంగా ఫోటోగ్రఫీలోనూ అనేక మార్పులు వచ్చినా.. తన కళపై నమ్మకంతో రాము నిరంతరం కొత్తదనాన్ని అందిపుచ్చుకుంటున్నారు. ఒకప్పుడు సాధారణ కెమెరాతో ప్రారంభమైన ఆయన ప్రయాణం.. నేడు ఆధునిక ఫోటోగ్రఫీ టెక్నాలజీ వరకు కొనసాగుతోంది.

“నమ్ముకున్న వృత్తి ఎప్పుడూ మోసం చేయదు” అన్న నమ్మకంతో రాము ఫోటోగ్రఫీని కొనసాగిస్తున్నారు. ఈ వృత్తే తన కుటుంబానికి భరోసాగా నిలిచిందని, ఫోటోగ్రఫీ ద్వారా కుటుంబాన్ని ఆనందంగా పోషించుకుంటున్నానని రాము చెబుతున్నారు.

ఓ చిన్న వయసులో మొదలైన ఆసక్తి.. నేడు జీవితానికి ఆధారంగా మారింది. కెమెరా వెనుక నిలబడి ఎన్నో జ్ఞాపకాలను చిత్రాలుగా మలుస్తూ.. తన వృత్తిపై ప్రేమతో 28 ఏళ్లుగా సాగుతున్న రాము ప్రయాణం యువతకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది.

Kola Venkatesh, Staff Reporter -Mancherial

Kola Venkatesh, Staff Reporter -Mancherial

11 ఏళ్ల జర్నలిజం అనుభవం కలిగిన సీనియర్ పాత్రికేయుడు. రాజకీయాలు, సామాజిక అంశాలు, స్థానిక సమస్యలు మరియు ప్రత్యేక కథనాలపై విస్తృతంగా పనిచేస్తూ ప్రజలకు ఖచ్చితమైన, విశ్వసనీయమైన వార్తలను అందిస్తున్నారు.

Next Story